Kodikatti case : కోడికత్తి కేసులో కుట్ర కోణం లేదు!

కోడికత్తి దాడి కేసులో లోతైన దర్యాప్తు జరపాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని....NIA స్పష్టం చేసింది. ఈ కేసులో ఎలాంటి కుట్రకోణం లేదని, జగన్ పిటిషన్‌ను కొట్టేయాలని కోరింది. కోడికత్తి కేసులో లోతైన విచారణ జరపాలంటూ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో జగనన్ అభ్యర్థనను నిరాకరిస్తూ విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు గతంలో ఇచ్చిన స్టేని ఎత్తేయాలని అభ్యర్థించింది. ప్రస్తుత పిటిషన్ డివిజన్ బెంచ్ వద్ద విచారణకు వచ్చేలా రిజిస్ట్రీని ఆదేశించాలని కోరింది. NIA ఇన్‌స్పెక్టర్ శశిరేఖ ఈ మేరకు హైకోర్టులో కౌంటరు దాఖలు చేశారు. కోడికత్తి దాడి కేసులో కుట్రకోణం తేల్చేందుకు లోతైన విచారణ జరపాలని జగన్ వేసిన పిటిషన్‌ను విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు ఈ ఏడాది జులై 25న కొట్టేసింది. NIA కోర్టు ఉత్తర్వులను.... జగన్ హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు సింగిల్‌జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి అక్టోబరు 10న విచారణ జరిపారు. ఈ కేసులో విచారణను 8 వారాలు నిలుపుదల చేశారు.

NIAకోర్టు ఉత్తర్వులపై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన డివిజన్ బెంచ్ మాత్రమే విచారణ జరపాలని.. దర్యాప్తు సంస్థ కోరింది. జగన్‌పై దాడికేసులో నిందితుడు శ్రీనివాసరావు పాత్ర తప్ప... మరోవ్యక్తికిగానీ,. రాజకీయ పార్టీకిగానీ ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యాధారాలు లేవని తేల్చిచెప్పింది. ఏ అంశాన్నీ వదలకుండా దర్యాప్తు చేశామని, సీఎం జగన్‌పై దాడిలో కుట్రకోణం లేదని వెల్లడించింది. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకుని... లోతైన దర్యాప్తు కోసం సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయాలని కోరింది. జగన్ ఆరోపించినట్లు.. విశాఖఎయిర్‌పోర్టు హోటల్ హర్షవర్ధన్ పాత్ర ఉన్నట్లు ఆధారాలేవీ లభ్యం కాలేదని స్పష్టం చేసింది.
రాష్ట్రంలోని ఎన్‌ఐఏ కేసులను విచారించే కోర్టుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం ఈ ఏడాది జులై 24న గెజిట్ ప్రకటన జారీచేయడానికి ముందే... లోతైన దర్యాప్తునకు అభ్యర్థిస్తూ.... పిటిషనర్ వేసిన అనుబంధ పిటిషన్‌పై ఎన్‌ఐఏ కోర్టు పూర్తిస్థాయిలో వాదనలు విని తీర్పును వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో.. విజయవాడ ఎన్‌ఐఏ కోర్టుకు విచారణ పరిధి లేదనే ప్రశ్నే ఉత్పన్నం కాదని, ఎన్‌ఐఏ కోర్టు ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయని NIA స్పష్టం చేసింది. జగన్ పిటిషన్‌కు విచారణార్హతే లేదని, ప్రారంభదశలోనే దాన్ని తోసిపుచ్చాలనికోరింది.సహేతుకకారణంలేకుండా సీఎం హైకోర్టును ఆశ్రయించారని ఆక్షేపించింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com