Kondapalli: మరోసారి వాయిదా పడిన కొండపల్లి మున్సిపల్ ఎన్నికలు..

Kondapalli (tv5news.in)

Kondapalli (tv5news.in)

Kondapalli: వైసీపీ విధ్వంసంతో కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నిరవధిక వాయిదా పాడింది.

Kondapalli: వైసీపీ విధ్వంసంతో కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నిరవధిక వాయిదా పాడింది. వాయిదా వేయడాన్ని నిరసిస్తూ టీడీపీ ఆందోళనలకు దిగింది. ఎంపీ నాని, టీడీపీ కౌన్సిలర్లు మున్సిపల్ ఆఫీసులోనే బైఠాయించారు. టీడీపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నా ఎన్నికను అడ్డుకునేందుకు ఇన్ని కుట్రలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ వాళ్లే గొడవలు చేస్తూ మళ్లీ వాళ్లే నిసనలకు దిగుతున్నారని విమర్శించారు. వైసీపీ తీరుతో కొండపల్లి, ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కొండపల్లి, ఇబ్రహీంపట్నంలో పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించారు. మరోవైపు కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా ఇవాళ కూడా వైసీపీ కౌన్సిలర్లు రచ్చ చేశారు. మరోసారి బల్లలు, టేబుళ్లను విరగ్గొడుతూ వీరంగం సృష్టించారు.

బయట ఉన్న వైసీపీ కార్యకర్తలు బారికేడ్లు తోసుకుని మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించడం కూడా ఉద్రిక్తతను రెట్టింపు చేసింది. ఈ అరాచకంపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఘర్షణలకు తావులేకుండా ఎన్నికను సజావుగా జరిపించాల్సిన అధికారులు.. ఇంత జరుగుతున్నా ఉదాసీనంగానే వ్యవహరిస్తున్నారని మండిపడుతోంది. ఓ పక్క పరిషత్ హాల్‌లో ఎన్నికకు సిద్ధమై.. అటు కోర్టులోనూ న్యాయపోరాటం చేస్తోంది. కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సజావుగా సాగేలా చూడాలని పిటిషన్ వేసింది.

Tags

Next Story