టీవీ5 ప్రతినిధిపై YCP గుండాల దాడి

టీవీ5 ప్రతినిధిపై YCP గుండాల దాడి
ప్రకాశం జిల్లాలో అధికార పార్టీ నాయకులు అరాచకం సృష్టించారు. కొండెపి నియోజకవర్గం మిట్టపాంలెలో కవరేజీకి వెళ్లిన టీవీ5 ప్రతినిధి మల్లిఖార్జున్‌పై YCP ఇన్‌చార్జ్‌ అశోక్‌బాబు అనుచరులు దాడికి పాల్పడ్డారు

ప్రకాశం జిల్లాలో అధికార పార్టీ నాయకులు అరాచకం సృష్టించారు. కొండెపి నియోజకవర్గం మిట్టపాంలెలో కవరేజీకి వెళ్లిన టీవీ5 ప్రతినిధి మల్లిఖార్జున్‌పై వైసీసీ ఇన్‌చార్జ్‌ అశోక్‌బాబు అనుచరులు దాడికి పాల్పడ్డారు. కెమెరా, ఫోన్లు లాక్కొని వీరంగం సృష్టించారు. పార్టీలో వర్గా విభేదాలు బయటపడ్డాయన్న అక్కసుతో అధికార పార్టీ నాయకులు బరితెగించారు. ఏం చేయాలో పాలుపోక మీడియాపై అక్కసు వెళ్లగక్కారు.

మిట్టపాలెం గ్రామంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైసీపీ ఇంచార్జ్ అశోక్‌బాబుకు వ్యతిరేకంగా వైసీపీలోని మరోవర్గం పోస్టర్లు అంటించింది. తమ ఇంటికి రావద్దు అంటూ గ్రామంలోని ఇళ్లకు పోస్టర్లు అంటించారు. మిట్టపాలెంలో కవరేజ్‌కు వెళ్లిన టీవీ 5 ప్రతినిధిపై అశోక్‌బాబు అశోక్‌బాబు అనుచరులు దాడి చేశారు. గ్రామస్తుల సమక్షంలోనే ఈ దాడి ఘటన జరిగింది. అడ్డుకోబోయిన పోలీసులపైనా వైసీపీ శ్రేణులు దాడికి యత్నించాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. టీవీ5 ప్రతినిధిని పోలీసులు అక్కడి నుంచి పంపించారు. గ్రామంలోని ఓ ఇంట్లో గదిలో ఉంచారు.

Tags

Read MoreRead Less
Next Story