కృష్ణా జిల్లాలో పేట్రేగిపోతున్న కబ్జాకోరులు

కృష్ణా జిల్లాలో పేట్రేగిపోతున్న కబ్జాకోరులు
పేదలకు ఉచిత వైద్యం, విద్య కోసం ఏర్పాటు చేసిన ముప్పవరపు చౌదరి అండ్‌ లీలా రామకృష్ణ ప్రసాద్ ట్రస్ట్‌ను కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించారు

కృష్ణా జిల్లా పెనమలూరులో కబ్జాకోరుల ఆగడాలు పేట్రేగిపోతున్నాయి. పేదలకు ఉచిత వైద్యం, విద్య కోసం ఏర్పాటు చేసిన ముప్పవరపు చౌదరి అండ్‌ లీలా రామకృష్ణ ప్రసాద్ ట్రస్ట్‌ను కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించారు. ట్రస్ట్ భూముల్లో రౌడీలు, గూండాలు దౌర్జన్యంగా ప్రవేశించి ట్రస్ట్ మెంబర్లను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ట్రస్ట్ పత్రాలు అప్పజెప్పి అమెరికా వెళ్లిపోవాలని కబ్జా కోరులు బెదిరిస్తున్నారని.. ట్రస్ట్ మెంబర్ NRI శ్రీనివాసరావు తెలిపారు. పేదల కోసం 1999లో ట్రస్ట్ ఏర్పాటు చేశామన్నారు. కబ్జా కోరులకు స్థానిక వైసీపీ నేతలు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ట్రస్టీలో మరో నెంబర్‌గా ఉన్న ముప్పవరపు హేమంత్.. కబ్జా కోరులతో చేతులు కలిపి నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని శ్రీనివాసరావు ఆరోపించారు.

దీనిపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించామని వెల్లడించారు. పేదల కోసం స్థాపించిన ట్రస్ట్‌ భూములను కాపాడాలని.. ట్రస్ట్‌ కబ్జాపై జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఫిర్యాదు చేశానని శ్రీనివాస్‌రావు తెలిపారు. అయినా ఎలాంటి స్పందన లేదన్నారు. కబ్జాకోరులపై చర్యలు తీసుకోకుంటే సీఎం, డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. పేదల కోసం స్థాపించిన ట్రస్ట్‌ భూములు కాపాడుకోవడం కోసం ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story