Krishnamma Ugrarupam : కృష్ణమ్మ ఉగ్రరూపం: భారీగా నీటి విడుదల...

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లోని ఎగువ నుంచి వచ్చిన వరదల కారణంగా కృష్ణా నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. దీంతో కృష్ణా నదిపై ఉన్న అన్ని జలాశయాల గేట్లను ఎత్తివేసి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జులై నుంచి వరదల కారణంగా వేల టీఎంసీల నీరు ఇప్పటికే సముద్రంలోకి వెళ్ళింది.
ప్రస్తుతం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, మరియు ప్రకాశం బ్యారేజీల వద్ద నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయా జలాశయాల గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా జూరాల నుంచి భారీ వరద ప్రవాహం శ్రీశైలం రిజర్వాయర్‌కు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
శ్రీశైలం జలాశయం నుంచి 3,39,496 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ వరద ప్రవాహం నాగార్జున సాగర్ రిజర్వాయర్‌కు చేరుకోవడంతో అధికారులు 29 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణా నది ప్రవాహం మరింత వేగంగా ప్రకాశం బ్యారేజ్‌కు చేరుకుంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద కూడా కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చి, వేగంగా సముద్రంలోకి పరుగెడుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేసారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com