Kurnool : భారీ శబ్దంతో రెండుగా చీలిన నర్సప్ప కొండ

Kurnool :  భారీ శబ్దంతో రెండుగా చీలిన నర్సప్ప కొండ
ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్, మైనింగ్ ఏడీ నాగిణి, పోలీసులు విరిగిన కొండను పరిశీలించారు

కర్నూలు జిల్లా గొనెగండ్లలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎస్సీ కాలనీ దగ్గర 30 అడుగుల ఎత్తులో ఉన్న నర్సప్ప కొండ ఒక్కసారిగా భారీ శబ్దంతో రెండుగా చీలింది. విరిగిన కొండ గ్రామం మీదకు పొర్లుతుందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. దాంతో ప్రమాదం జరగకుండా అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్, మైనింగ్ ఏడీ నాగిణి, పోలీసులు విరిగిన కొండను పరిశీలించారు. ప్రమాదం జరగకుండా ముందస్తుగా ఎస్సీ కాలనీలో కొండ చుట్టూ ఉన్న కుటుంబాలను ఖాళీ చేయించారు. స్థానిక స్కూల్‌లో వారికి వసతి ఏర్పాటు చేసిన అధికారులు.. రెండుగా చీలిన కొండను ముక్కలుగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story