Kurnool: ఆదర్శాలను ఆచరణలో చూపించిన కలెక్టర్.. కుమారుడిని అంగన్వాడీ స్కూల్‌లో చేర్పించి..

Kurnool: ఐఏఎస్, ఐపీఎస్ పిల్లల చదువులంటే.. కార్పొరేట్ స్కూళ్లు, అధునాతన వసతులు, భారీ భవంతుల ప్రైవేట్ పాఠశాలలో గుర్తుకు వస్తాయి. అయితే ఇవేమిగాకుండా.. తన నాలుగేళ్ల కుమారుడిని అంగన్వాడీ ఫ్రీ స్కూల్‌లో చేర్పించాడు ఆ కలెక్టర్. చెప్పేమాటలను ఆచరణలోచూపించాలన్ననానుడిని అక్షరాల ఆచరించారు కర్నూలు జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు. కలెక్టర్ కోటేశ్వరరావు ఆదర్శభావాలను చూసి ఔరా అంటూ ఆశ్చర్యపోవటం స్థానికులవంతైంది.
కర్నూలు కలెక్టర్ కోటేశ్వరరావు, సతీమణి స్వర్ణలత దంపతుల గారాలపట్టి దివిఆర్వీన్. అందరికంటే భిన్నంగా కలెక్టర్ కోటేశ్వరరావు తన కుమారుడిని బుధవారపేట్‌లోని అంగన్వాడీలో చేర్పించారు. అంగన్వాడీ కేంద్రంలో దివి ఆర్వీన్.. పిల్లలతో ఆటలు ఆడుతూ.. రంగులు దిద్దుకుంటూ సరదాగా కనిపించాడు. అందరికి ఆదర్శంగా నిలిచిన కలెక్టర్ కోటేశ్వరరావును అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com