Kurnool: 'ఒళ్ళు వాయకొడతాం జాగ్రత్త'.. మీడియాకు కర్నూలు మేయర్ బెదిరింపులు..

X
Kurnool: కర్నూలులో జనం లేక వైసీపీ మంత్రుల బస్సు యాత్ర అట్టర్ ప్లాప్ అయింది. అయితే ఆ అసహనాన్ని మీడియా మీద చూపించారు కర్నూల్ మేయర్ బీవై రామయ్య. సహనం కోల్పోయిన మీడియాపై చిందులు తొక్కారు. అధికారంలో ఉండేది తమ ప్రభుత్వమని.. మీ ఒళ్ళు వాయకొడతాం జాగ్రత్త అంటూ మీడియా ప్రతినిధులకు బెదిరించారు మేయర్ రామయ్య. సభని విజయవంతం చేసుకోలేని వైసీపీ నేతలు... వాస్తవాలు చూపించిన మీడియాకు బెదిరింపులకు దిగడంపై మండిపడుతున్నాయి జర్నలిస్టు సంఘాలు. మేయర్ తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కుతీసుకోవాలని డిమాండ్ చేశాయి. లేదంటే తమ పోరాటం కొనసాగిస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
