Kakinada: బిచ్చగాడు కాదు ధనవంతుడు..! సాధువు ఇంట డబ్బు సంచులు..

X
Kakinada: కాకినాడ జిల్లాలో భారీగా డబ్బు సంచులు వెలుగుచూశాయి. ఈ ఘటన కరప మండలం వేళంగిలో జరిగింది. భిక్షాటన చేసుకుని జీవించే సాధువు గదిలో డబ్బు సంచులు గుర్తించారు. అయితే.. ఆయన గుండెపోటుతో చనిపోయాడని.. ఐదేళ్ల నుంచి ఇదే గ్రామంలో ఉంటున్నాడని స్థానికులు తెలిపారు. రామకృష్ణ అనే సాధువు రక్ష రేకులు కడుతూ.. భిక్షాటన చేస్తుండేవారన్నారు. గదిలో ఉన్న సంచులను తీయగా భారీగా నగదు బయటపడింది. వీఆర్వో, పోలీసుల సమక్షంలో లెక్కింపు చేపట్టారు. రెండు లక్షలపైనే ఉంటుందని అంచనా వేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
