Lambasingi: చలికి వణుకుతున్న మన్యం.. రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

Lambasingi: చలి పులి పంజాకు మన్యం గజగజా వణికిపోతోంది. కోల్డ్ వేవ్ ప్రభావం రాష్ట్రాన్ని తాకడంతో మునుపెన్నడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.చలిగాలుల తీవ్రత పెరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పడిపోయాయి. అక్కడ సాధారణం కంటె తక్కువ డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆంధ్రా కశ్మీర్‌గా పిలిచే లంబసింగిలో మైనస్ డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయి.చింతపల్లితో పాటు హుకుంపేట,జి.మాడుగుల తదితర ప్రాంతాల్లో 1.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి.టెంపరేచర్ పడిపోవడంతో ప్రజలు,పర్యాటకులు బయటకు రావడానికే బెంబేలెత్తిపోతున్నా రు.
మరోవైపు బయట నిలిపిన వాహనాలపై మంచు గడ్డ కడుతుంది.మరో 3 రోజులు ఇదే తీవ్రతతో పరిస్థితి కొనసాగవచ్చని, చిన్నపిల్లలు.. వృద్ధులు.. శ్వాసకోశ సంబంధిత సమస్యలున్న వాళ్లు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com