APలో భారీగా పెరిగిన భూముల ధరలు

APలో భారీగా పెరిగిన భూముల ధరలు
ఇప్పటికే ఆరుసార్లు రిజిస్ట్రేషన్‌ శాఖ ఛార్జీలు పెంచిన జగన్ సర్కార్‌ మరోసారి భూముల ధరల పెంపుకు ఆమోదముద్ర వేసింది

ఏపీలో భూముల ధరలు పెరిగాయి.పెరిగిన భూముల ధరలు ఇవాల్టీ నుంచి అమల్లోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో ప్రజలపై భారీగా భారం పడనుంది.ఇప్పటికే ఆరుసార్లు రిజిస్ట్రేషన్‌ శాఖ ఛార్జీలు పెంచిన జగన్ సర్కార్‌ మరోసారి భూముల ధరల పెంపుకు ఆమోదముద్ర వేసింది. సర్కార్‌ నిర్ణయంతో ఈ ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వ ఖజానాకు భారీగానే ఆదాయం వచ్చి చేరనుంది. గత ఏడాది స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా 8 వేల కోట్ల ఆదాయం లభించగా ఈ ఏడాది దానిని 12 వేల కోట్లకు పెంచుతూ టార్గెట్‌ పెట్టుకుంది సర్కార్‌.

భూముల రేట్ల పెంపు ఒక్కో జిల్లాలో, ఒక్కో ప్రాంతంలో వేర్వేరుగా ఉండనున్నాయి. ఈమేరకు జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు కొత్త ధరలు జాబితా సిద్ధం చేశారు. గతేడాది జిల్లాల విభజన, భూముల ధరలు పెరుగుదలతో ప్రభుత్వానికి దాదాపు 8 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. నెలకు సగటున 700 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఈ నేపధ్యంలోనే ఆదాయాన్ని మరింత పెంచుకునేలా ధరలు పెంపునకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అయితే విశాఖపట్టణంలో పెరిగిన భూముల ధరలు ఈవిధంగా ఉన్నాయి. జిల్లాలో సగటున 25 శాతం వరకు భూముల ధరలు పెరిగాయి. ఆనందపురం, మధురవాడ, ఎండాడ ప్రాంతాల్లో రేట్లు అధికంగా పెంచారు.రెసిడెన్షియల్, కమర్షియల్, అగ్రికల్చర్ విభాగాలుగా తీసుకొని రేట్లు ఖరారు చేశారు. స్పెషల్ మార్కెట్ రివిజన్ పేరుతో అధిక లావాదేవీలు జరుగుతున్న ప్రాంతాలే టార్గెట్‌గా ధరలు నిర్ణయించారు. ఈ క్రమంలోనే రెసిడెన్షియల్, కమర్షియల్, అగ్రికల్చర్ విభాగాలుగా విభజన చేశారు.

గేటెడ్ కమ్యూనిటీల్లో చదరపు అడుగు రూ.4,500 - రూ. 5,000 ఉండగా ఆనందపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో, రాజుల తాళ్లవలసలో గజం రూ.9,500 ఉండగా, రూ.11,500 చేశారు.గండిగుండంలో రూ.5,200 కాగా రూ.8 వేలు చేశారు. శొంఠ్యాంలో రూ.6,400 కాగా రూ.9 వేలకు పెంచారు. అలాగే రామవరంలో రూ.5,700 ఉండగా రూ.8 వేలు చేశారు. గిరిజాలలో రూ.4,400 ఉండగా రూ.7 వేలు చేశారు. ఆనందపురంలో రూ.9,500 ఉండగా... రూ.12 వేలకు పెంచారు. వ్యవసాయ భూముల ధరలు 25 శాతానికి పైగా పెంపు శొంఠ్యాంలో ఎకరా రూ.50 లక్షలు కాగా రూ.70 లక్షలకు పెంచారు. గండిగుండంలో రూ.55 లక్షల నుంచి రూ.75 లక్షలు, రామవరంలో రూ.28 లక్షల నుంచి రూ.45 లక్షలకు, తాళ్లవలస 15లో రూ.90 లక్షల నుంచి రూ.1.3 కోట్లకు, ఆనందపురంలో రూ.73 లక్షల నుంచి రూ.95 లక్షలకు పెంపు.

మధురవాడ పరిధిలో నాలుగు గ్రామాల్లోనే పెంచారు. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో.. మధురవాడ, ఎండాడ, బక్కన్నపాలెం, పీఎం పాలెం గ్రామాల్లో మాత్రమే రేట్లు పెరిగాయి. ఇక్కడ రెసిడెన్షియల్ స్థలం గజం రూ.6,300 నుంచి రూ.40 వేల వరకు ఉండగా వాటిని రూ.11 వేల నుంచి రూ.60 వేలకు, కమర్షియల్ గజం రూ.45 వేలు ఉండగా దానిని రూ.60 వేల వరకు మధురవాడలో వుడా హెచ్ఐజీ గజం రూ.35 వేలు ఉండగా రూ.45 వేలు, ఎంఐజీ రూ.35 వేలు కాగా రూ.40 వేలకు, ఎల్ఎస్ఐజీ గజం రూ.30 వేలు కాగా రూ.35 వేలు, గేటెడ్ కమ్యూనీటిలో రూ.2,900 నుంచి రూ.3,500 వరకు పెరిగాయి.

Tags

Read MoreRead Less
Next Story