AP : ఏపీలో సురక్షిత నీటి సరఫరాకు లేటెస్ట్ టెక్నాలజీ

సురక్షిత నీటితో పాటు వేగంగా సరఫరా అయ్యేలా, లీకేజీలను పర్యవేక్షించడానికి లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, అధి కారులు పాల్గొన్నారు. పురోగతి లేని పనులు టెండర్లు రద్దు చేయాలని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ తప్పిదాలే జల్ జీవన్ మిషన్ ఆలస్యానికి కారణమని, ఆ తప్పులు సరిదిద్ది కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసి నిధులు తీసుకొస్తామని తెలిపారు.
గత ఐదేళ్లలో జల్ జీవన్ మిషన్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి ఉంటే ఈ పాటికే ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీరు అందేదని చెప్పారు. గుత్తేదారులు ఎలాంటి క్వాలిటీ మెటీరియల్ వాడుతున్నారో తనిఖీలు చేయాలని చెప్పారు. మళ్లీ 3 నెలల్లో పనులు పట్టాలెక్కించి పరుగులు పెట్టించాలని అధికారులను ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com