YS Jagan : జగన్ స్వార్థానికి బలైపోతున్న ఐపీఎస్ అధికారులు..

YS Jagan : జగన్ స్వార్థానికి బలైపోతున్న ఐపీఎస్ అధికారులు..
X

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎంతటి అరాచక పాలన సాగించారో ఏపీలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన స్వార్థం కోసం అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశారు. మరీ ముఖ్యంగా ఐపీఎస్ అధికారులను, ఐఏఎస్ అధికారులను తన వ్యక్తిగత కక్షాలను తీర్చుకోవడానికి వాడుకున్నారు. ఆనాడు జగన్ కళ్ళలో ఆనందం చూడడం కోసం ఐపిఎస్ అధికారులు ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయారు. జగన్ చెప్పిన మాయమాటలను నమ్మి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ.. అప్పటి ప్రతిపక్ష టిడిపి నేతలపై ఇష్టం వచ్చినట్టు అక్రమ కేసులు పెట్టారు. ప్రతిపక్ష నేతలను వేధించారు. రఘురామ కస్టోడియల్ టార్చర్ నుంచి మొదలు పెడితే.. సీఎం చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేయడం వరకు ఎన్నో దురాగతాలకు ఐపిఎస్ అధికారులను బలి చేశారు జగన్. నాడు తప్పులు చేసిన ఐపిఎస్ అధికారులు నేడు శిక్షలు అనుభవిస్తున్నారు.

అయితే జగన్ మాత్రం ఇప్పుడు వారిని కనీసం పట్టించుకోవట్లేదు. నాడు తన స్వార్థానికి ఇష్టానుసారం అధికారులను ఒత్తిడి చేసి రూల్స్ కు వ్యతిరేకంగా పనిచేయించారు జగన్. ఇప్పుడు వాళ్లంతా చట్టపరంగా చర్యలు అనుభవిస్తున్నారు. సునీల్ కుమార్, శ్రీలక్ష్మి ఇలా చాలామంది సస్పెన్షన్ కు గురయ్యారు. తాజాగా అప్పటి ఐజి సునీల్ నాయక్ ను పోలీసులు అరెస్టు చేశారు. కానీ జగన్ అటువైపు కన్నెత్తి చూడట్లేదు. వాళ్ల గురించి మాట్లాడితే ఎక్కడ తాను చేసిన దురాగతాలు బయటకు వస్తాయో అనే భయంతోటి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటున్నారు.

నాడు జగన్ కోసం పని చేసిన ఐపీఎస్ అధికారులు అందరూ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. జగన్ అప్పుడు తమను ఒత్తిడి చేసి తప్పులు చేయించాడని ఇప్పుడు మాత్రం సైలెంట్ గా ఉండిపోతున్నాడు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. నిజంగా ఇది చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే ఏమవుతుందో ఐపీఎస్ అధికారులు తెలుసుకోవాల్సిన సమయం. జగన్ మాయలో పడి తమ ఉద్యోగాలకు ఎసరు తెచ్చుకునే బదులు.. చట్టానికి అనుకూలంగా పనిచేస్తే వారికే మంచిది అంటున్నారు న్యాయ నిపుణులు.

Tags

Next Story