Leopard Attack: మాజీ సర్పంచ్‌ని చంపేసిన చిరుత

నంద్యాల-గిద్దలూరు ఘాట్ రోడ్డులోని పచర్లలో దారుణం జరిగింది. పచర్ల మాజీ సర్పంచ్ షేక్ మెహరున్నిసాపై చిరుత దాడి చేసి చంపేసింది. కట్టెల కోసం అడవిలో వంక వద్దకు వెళ్లిన షేక్ మెహరున్నిసా పై చిరుత దాడి చేసింది. షేక్ మెహరున్నిసాను చంపి తలను తినేసినట్లు స్థానికులు చెబుతున్నారు. షేక్ మెహరున్నిసాపై చిరుత దాడి చేయడంతో కేకలు వేసిందని, ఆ కేకలు విన్న స్థానికులు వంక వద్దకు వెళ్లేసరికి చిరుత అప్పటికే చంపేసిందని గ్రామస్తులు చెబుతున్నారు. స్థానికులకు మొహారాన్నేసాల్ మాట్లాడుతూ.. మెహరున్నిసా మొండెం మాత్రమే కనిపించింది అని వెల్లడించారు.. అయితే, కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తోందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం కూలీ షేక్ బీబీ పై కూడా చిరుత దాడి చేసి గాయపరిచింది. చిరుతను పట్టుకోవడానికి 10 కెమెరాలు, 2 బోన్లు ఏర్పాటు చేశారు అటవీ అధికారులు. చిరుత దాడి ఘటనతో అటవీ అధికారులు పచర్లకు బయలుదేరి వెళ్లారు. ఆ చిరుతను వెంటనే బంధించి.. తమ ప్రాణాలు కాపాడాలని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com