MLA Amilineni : ప్లాస్టిక్ నిషేదిద్దాం.. ఆరోగ్యాలను కాపాడుకుందాం

ప్లాస్టిక్ ను మన జీవితాల నుంచి నిషేధించి ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అందుకు ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి ప్లాస్టిక్ ను నిర్మూలించి స్వచ్చమైన సమాజాన్ని స్థాపించుకుందామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు. నేడు స్వచ్చ భారత్ లో భాగంగా స్వచ్చాంద్ర.. స్వచ్చ దివస్ ర్యాలీలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్లాస్టిక్ నియంత్రణ కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా ముందుకు వెళ్లాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ పరిసరాలు శుభ్రంగా ఉంటే ఎలాంటి అనారోగ్యాలు మన ధరిచేరకుండా ఉంటాయాని, అందుకోసం బాధ్యత కలిగిన పౌరులుగా సమాజం నుంచి పూర్తిగా ప్లాస్టిక్ నిషేధించి మన వంతుగా సమాజం కోసం పాటుపడాలన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com