ఏపీలో శాంతిభద్రతల అంశాన్ని అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లాం : గల్లా జయదేవ్

ఏపీలో అచ్చెన్నాయుడు అరెస్ట్, పట్టాభిపై దాడి ఘటనను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు టీడీపీ ఎంపీలు. రాష్ట్రంలో జడ్జిలు, ఎస్‌ఈసీపై దాడులు, మత మార్పిడిలు, ఆలయాలపై దాడుల గురించి ఫిర్యాదు చేశామన్నారు ఎంపీ గల్లా జయదేవ్. మీడియాపై కూడా దాడి జరుగుతోందని.. కేబుల్ ఆపరేటర్లను బెదిరిస్తున్నారని చెప్పామని గల్లా జయదేవ్ అన్నారు.
ఏపీలో వైసీపీ దురాగతాలను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లామన్నారు ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్. ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, విమర్శించినా.. ప్రతిపక్ష నేతలు, మీడియాపై కేసులు పెడుతున్నారని.. వీటిపై విచారణ జరపాలని అమిత్‌షాకు ఫిర్యాదు చేశామని కనకమేడల తెలిపారు. వీటికి సంబంధించి ఆధారాలను కేంద్ర హోంమంత్రికి సమర్పించామన్నారు. రాష్ట్రంలో ఇలాంటివి జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమనే అభిప్రాయాన్ని అమిత్‌షా వ్యక్తం చేసినట్లు ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com