Lok Sabha Polls: ఏపీలో తొలి రోజు జోరుగా నామినేషన్లు
కోస్తాంధ్రలో తొలిరోజు నామినేషన్లు ప్రక్రియ ఉత్సాహంగా సాగింది. అభ్యర్థులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి నామపత్రాలు దాఖలు చేశారు. కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరాగా భారీ ర్యాలీలతో నామినేషన్ల ప్రక్రియ కోలాహలంగా సాగింది. కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులూ నామినేషన్లు వేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేష్ తరఫున తెలుగుదేశం, జనసేన, భాజపా నేతలు నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా మంగళగిరిలోని సీతారామ కోవెల ఆలయం వద్ద నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజులు చేశారు. అనంతరం భారీ ర్యాలీగా వెళ్లారు. వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులంతా కలిసి లోకేష్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్, బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ కూడా మంగళగిరి నియోజకవర్గంలో నామినేషన్లు దాఖలు చేశారు. వీరితోపాటు మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పించారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి నామినేషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం, జనసేన, భాజపా కార్యకర్తలు పెద్దఎత్తున ర్యాలీగా వెళ్లిఆర్వోకు పత్రాలు సమర్పించారు. నరసరావుపేట లోక్‌సభ కూటమి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్‌కురెండు సెట్ల నామినేషన్ పత్రాలు అందజేశారు. ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్ధిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి నామినేషన్ వేశారు. కుమారుడు రాఘవరెడ్డితో కలిసి... ఆర్వో కార్యాలయంలో నామపత్రాలు అందించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా చదలవాడ అరవిందబాబు ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం కార్యాలయం నుంచి కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లిన చదలవాడ... రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించారు
కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ కూటమి అభ్యర్ధిగా యార్లగడ్డ వెంకట్రావు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. పామర్రు అసెంబ్లీ కూటమి అభ్యర్థి వర్ల కుమార్ రాజాఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ నెల 24న మరోసారి నామినేషన్ వేస్తానని... తెలిపారు. మచిలీపట్నంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి పావనినామినేషన్ వేశారు.
నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా ఆఫీస్ కార్యాలయంలో.. వైకాపా అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆ తరువాత తెలుగుదేశం అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నామినేషన్ పత్రాలు సమర్పించారు. కూటమి అభ్యర్థులను పంపించే సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయానికి వైకాపా అభ్యర్థులు రావడంతో గొడవ జరిరి కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు ఇరువర్గాలను చెదరకొట్టడంతో గొడవ సద్దుమణిగింది. కావలిలో వైకాపా అభ్యర్థి ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
తొలిరోజు మొత్తం 229 నామినేషన్లు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com