LOKESH: ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్:లోకేశ్

మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చిందని.. ఇప్పుడు గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అ‘‘కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదు.. ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖకు వస్తున్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద రాష్ట్రానికి పరిశ్రమలు తరలివస్తున్నాయి. గూగుల్ పెట్టుబడితో లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. సెప్టెంబర్ 2024లో గూగుల్ ప్రతినిధులు విశాఖ వచ్చినప్పుడు వారితో సమావేశమయ్యాను. వారికి డేటా సెంటర్ స్థలాన్ని చూపించాం. ఇది జరిగిన నెల రోజుల్లో యూఎస్ వెళ్లి గూగుల్ క్లౌడ్ నాయకత్వాన్ని కలిశా. నవంబర్‌లో గూగుల్ ప్రతినిధులు సీఎంను కలిశారు. ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు అనేకసార్లు భేటీ అయ్యారు. అనేక చర్చల తర్వాత ఇంత పెద్ద పెట్టుబడి సాధ్యమైంది. భారీ పెట్టుబడులపై అన్ని చోట్లా చర్చలు జరుగుతున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణ మా లక్ష్యం ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని.. అభివృద్ధి వికేంద్రీకరణ మా లక్ష్యం. అనంతపురం, కర్నూలుకు పంప్డ్ స్టోరేజ్, సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తున్నాయి. చిత్తూరు, కడపలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్‌ను తీర్చిదిద్దుతున్నాం. శ్రీసిటీ గ్రేటర్ ఎకోసిస్టమ్‌లో అనేక పెట్టుబడులు తీసుకొస్తున్నాం. డైకెన్, బ్లూస్టార్, ఎల్జీ పెట్టుబడులు పెరుగుతున్నాయి. అన్ని ప్రాంతాలను సమగ్ర అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం." అని లోకేశ్ అన్నారు.
పౌర సేవలు, ఆర్టీజీఎస్‌పై చంద్రబాబు సమీక్ష
ప్రభుత్వ శాఖలు అందించే పౌర సేవలు, ఆర్టీజీఎస్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల సేవలు, ప్రజా సంతృప్త స్థాయిపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ భేటీలో సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి, ఐటీ, ఆర్టీజీఎస్, ఎక్సైజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రజలకు కలిగిన ప్రయోజనాలు తదితర అంశాలపై వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. నిత్యావసరాలు, ఇతర ఉత్పత్తులపై పన్నులు తగ్గిన అంశంపై గిరిజన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు. దీపావళి తర్వాత కూడా ప్రజల్లోకి పన్ను తగ్గింపు అంశాన్ని తీసుకెళ్లాలని ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com