Lokesh: ఆ రోజు కుమిలిపోయా: లోకేశ్

టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబును 2024 ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తాను ఎదుర్కొన్న భావోద్వేగ పరిస్థితులపై నారా లోకేశ్ స్పందించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందుకు చంద్రబాబును అరెస్టుచేసి రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన పాడ్కాస్ట్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీరెప్పుడైనా కన్నీళ్లు పెట్టుకున్నారా? అని రిపోర్టర్ ప్రశ్నించగా.. చంద్రబాబు అరెస్టయిన రోజు కన్నీళ్లు వచ్చేశాయి. రాజమండ్రి జైల్లో చూసి గుండె తరుక్కుపోయింది అని లోకేశ్ వివరించారు. తండ్రి అరెస్ట్ నుంచి ప్రతి సెకను చాలా కష్టంగా గడిచేదని లోకేశ్ తెలిపారు. జైలులో తండ్రి ఏమన్నా జరుగుతుందోనని ఆందోళన చెందేవాడినని వెల్లడించారు. పార్టీ పరిస్థితిపైనా ఆందోళన చెందేవాడినని.. భవిష్యత్తు ఏంటనే ప్రశ్న ఆయన్ను చాలా కుంగదీసిందిని గుర్తు చేసుకున్నారు. 53 రోజుల తర్వాత తండ్రి చంద్రబాబుకు బయట వచ్చారు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి.. భారీ విజయం సాధించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com