LOKESH: రాష్ట్రపతిని కలిసిన మంత్రి లోకేశ్

LOKESH: రాష్ట్రపతిని కలిసిన మంత్రి లోకేశ్
X
రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేష్

రా­ష్ట్ర­ప­తి ద్రౌ­ప­ది ము­ర్ము­తో ఆం­ధ్ర­ప్ర­దే­శ్ వి­ద్య, ఐటీ శాఖల మం­త్రి నారా లో­కే­శ్ భేటీ అయ్యా­రు. ఎన్డీ­యే ఎం­పీ­ల­తో కలి­సి ఆయన మర్యా­ద­పూ­ర్వ­కం­గా కలి­శా­రు. అమ­రా­వ­తి­ని ఏపీ శా­శ్వత రా­జ­ధా­ని­గా గు­ర్తి­స్తూ బి­ల్లు­కు ఆమో­దం తె­లి­పి­నం­దు­కు రా­ష్ట్ర­ప­తి­కి లో­కే­శ్, ఎన్డీ­యే ఎం­పీ­లు కృ­త­జ్ఞ­త­లు తె­లి­య­జే­శా­రు. ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ప్ర­జల తర­ఫు­నా ధన్య­వా­దా­లు తె­లి­పా­రు. ఈ ని­ర్ణ­యం­తో రా­జ­ధా­ని రై­తు­లు, ఏపీ ప్ర­జ­లం­తా సం­తో­షం­గా ఉన్నా­ర­ని ఆమె­కు వి­వ­రిం­చా­రు. లో­కే­శ్, ఎం­పీ­ల­తో ము­చ్చ­టిం­చా­రు ద్రౌ­ప­ది ము­ర్ము. ఆం­ధ్ర­ప్ర­దే­శ్ సీఎం చం­ద్ర­బా­బు­పై ప్ర­శం­స­లు కు­రి­పిం­చా­రు. చం­ద్ర­బా­బు వి­జ­న­రీ లీ­డ­ర్ అంటూ మె­చ్చు­కు­న్నా­రు. అమ­రా­వ­తి ని­ర్మా­ణా­ని­కి రై­తు­లు 33 వేల ఎక­రా­లు ఇవ్వ­డం ని­జం­గా హర్ష­ణీ­య­మ­న్నా­రు ద్రౌ­ప­ది ము­ర్ము. అం­దు­కు కృషి చే­సిన చం­ద్ర­బా­బు గ్రే­ట్ అన్నా­రు.

చంద్రబాబు మార్క్ సంస్కరణలు

ఏపీ­లో పా­రి­శ్రా­మి­కా­భి­వృ­ద్ధి­ని పరు­గు­లు పె­ట్టిం­చేం­దు­కు సీఎం చం­ద్ర­బా­బు వి­ప్ల­వా­త్మక ని­ర్ణ­యం తీ­సు­కు­న్నా­రు. ‘డీ-రె­గ్యు­లే­ష­న్ ఫేజ్-2’ సమీ­క్ష­లో భా­గం­గా.. పరి­శ్ర­మల ఏర్పా­టు­కు ఆటం­కం­గా ఉన్న 800కు పైగా ని­బం­ధ­న­ల­ను 100 లో­పు­కు తగ్గిం­చా­ల­ని అధి­కా­రు­ల­ను ఆదే­శిం­చా­రు. పా­రి­శ్రా­మిక అను­మ­తుల కా­లా­న్ని 40 శాతం తగ్గిం­చ­డ­మే లక్ష్యం­గా.. సిం­గి­ల్ రి­జి­స్ట్రే­ష­న్ ద్వా­రా జీ­వి­త­కాల గు­ర్తిం­పు­ని­వ్వా­ల­ని అధి­కా­రు­ల­ను సూ­చిం­చా­రు. పరి­శ్ర­మల ఏర్పా­టు­కు ఆటం­కా­లు ఉం­డ­వ­ద్ద­ని ఆదే­శిం­చా­రు.

Tags

Next Story