LOKESH: 151వ రోజుకు చేరిన యువగళం పాదయాత్ర

లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాల్టితో 151వ రోజుకు చేరింది. ప్రస్తుతం కావలి అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతోంది.ఇప్పటి వరకు 1968 కిలోమీటర్లు నడిచారు. ఇవాళ మధ్యాహ్నం బంగారుపాలెం క్యాంప్ సైట్‌లో బీసీలతో సమావేశం అనంతరం పాదయాత్ర కొనసాగుతోంది. ఆ తర్వాత వడ్డిపాలెంలో గ్రామస్థులతో సమావేశమవుతారు. జువ్వలదిన్నలో అమరజీవి పొట్టి శ్రీరాములు గృహాన్ని సందర్శిస్తారు. అనంతరం చిప్పలేరు బ్రిడ్జి వద్ద స్థానికులతో మాటామంతీ నిర్వహిస్తారు ఆదినారాయణపురంలో స్థానికులతో సమావేశవుతారు. అనంతరం.. అన్నగారి పాలెంలోనూ, ఆ తర్వాత ఒట్టూరు క్రాస్ వద్ద స్థానికులతో సమావేశమవుతారు. నడింపల్లి క్రాస్, మామిళ్లదరువులో స్థానికులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం పువ్వుల దరువులో ప్రజా సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం చిననట్టు- పెదనట్టు క్రాస్ వద్ద స్థానికులతో సమావేశమవుతారు. ఇవాళ రాత్రి తుమ్మలపెంట విడిది కేంద్రంలో బస చేస్తారు.
అల్లూరు మండలం ఇస్కుపల్లిలో ఉప్పుసాగు రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. జగన్ ప్రభుత్వంలో ఉప్పు రైతులు కుదేలయ్యారని అన్నారు.అసాధారణ హామీలు ఇచ్చి జగన్ లా పరదాల్లో తిరగలేనన్న లోకేష్ టీడీపీ అధికారంలోకి రాగానే ఉప్పు రైతులను ఆదుకుంటామని చెప్పారు.గుజరాత్, తమిళనాడు ఉప్పు రైతులతో పోటీ పడే విధంగా చర్యలు చేపడుతామన్నారు.
విశాఖలోని విదాస్పద సీఐ స్వర్ణలత వ్యవహారంపై టీడీపీ ఫైర్ అయింది.A1 కాకుండా A4 గా మార్చడం వెనుక అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఉన్నాయని విశాఖ టీడీపీ పార్లమెంటరీ నియోజక వర్గ మహిళా అధ్యక్షురాలు అనంత లక్ష్మీ ఆరోపించారు.పోలీస్ శాఖలో ఉండి అక్రమ దందాలు చేయడం సిగ్గుచేటన్నారు. కోట్ల రూపాయలు మార్పిడి వెనుక అనేక అనుమానాలున్నాయన్నారు.నోట్ల మార్పిడి చేస్తే స్వర్ణలతకి సినిమాలో ఛాన్స్ ఇస్తామని ఓ ప్రజాప్రతినిధి, ఓ మంత్రి ఆఫర్ చేశారని అరోపించారు. నోట్ల మార్పిడి వెనుక పెద్ద కుట్ర ఉందని ఈ వ్యవహారంపై అవసరమైతే గవర్నర్‌ను కలుస్తామని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com