Nara Lokesh : నిరుద్యోగులకు లోకేశ్ గుడ్ న్యూస్

Nara Lokesh : నిరుద్యోగులకు లోకేశ్ గుడ్ న్యూస్
X

అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా మంత్రి లోకేశ్ ఏపీ యువతకు గుడ్ న్యూస్ చెప్పారు. అసెంబ్లీలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో మెగా డీఎస్సీ హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి లోకేష్ తెలిపారు. ఉపాధ్యాయుల నియామక అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని.. రిక్రూట్ మెంట్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ విభాగాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు మరిన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రోత్సహిస్తామని అసెంబ్లీలో మంత్రి లోకేష్ తెలిపారు.

Tags

Next Story