AP Crime: గుంటూరు జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య..

AP Crime: గుంటూరు జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య..
X
హైదరాబాద్‌లో లవ్‌.. ఏపీలో ఆత్మహత్య.

తమ వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్థాపంతో ప్రేమికులు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. పెదకాకాని గ్రామానికి చెందిన మహేశ్‌ (22), నందిగామ మండలం రుద్రవరానికి చెందిన శైలు (21) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. డిప్లొమా పూర్తి చేసిన మహేశ్‌ రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఓ మొబైల్‌ స్టోర్‌లో పని చేస్తున్నాడు. అదే సమయంలో మహేశ్​కు అక్కడే ఉన్న శైలజతో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది.

ఇటీవలే మహేశ్​, శైలు ప్రేమ విషయం వారి ఇరు కుటుంబాలకు తెలిసింది. 10 రోజుల క్రితం యువకుడి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించారు. కానీ యువతి కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. దీంతో ప్రేమికులు ఇద్దరూ ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. యువతి కుటుంబ సభ్యులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ పెదకాకాని సమీపంలో రైల్వే ట్రాక్‌పై విగత జీవులుగా కనిపించారు. ఈ సంఘటనతో పెదకాకాని గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags

Next Story