Madhavaram: ఊరు ఊరంతా ఒక సైన్యం.. అందరూ సైనికులే..

Madhavaram: ఊరు ఊరంతా ఒక సైన్యం.. అందరూ సైనికులే..
Madhavaram: ఏ ఊర్లోనైనా చదువుకున్న వాళ్లు ఏ హైదరాబాదో, బెంగళూరో వెళ్లి జాబ్ సంపాదించి అక్కడే సెటిల్ అయిపోవాలనుకుంటారు.

Madhavaram: ఏ ఊర్లోనైనా చదువుకున్న వాళ్లు ఏ హైదరాబాదో, బెంగళూరో వెళ్లి మంచి జాబ్ సంపాదించి అక్కడే సెటిల్ అయిపోవాలనుకుంటారు. కానీ పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలంలోని మిలటరీ మాధవరం అందుకు భిన్నం. తమ ప్రాణాలు పోయినా ఫర్వాలేదు కానీ తాముంది దేశం కోసమే అంటున్నారు. అసలు మాధవరం గ్రామానికి మిలటరీ మాధవరం అనే పేరెలా వచ్చిందో తెలియాలంటే హిస్టరీలోకి వెళ్లాల్సిందే.

బ్రిటిష్ కాలంలో మాధవవర్మ అనే రాజు తాడేపల్లిగూడెంలో ఆరుగొల అనే ప్రాంతాన్ని పాలించే వారు. అక్కడే తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని సైన్యాన్ని సిద్ధం చేసేవారు. సైన్యంలో పనిచేయాలనే కోరికతో మాధవరం యువత కూడా ఆస్థావరంలో నైపుణ్యాలు నేర్చుకున్నారు. అలా సైన్యంలో చేరి దేశానికి భద్రత కల్పిస్తున్న వారిగా గ్రామానికి మిలిటరీ మాధవరం అనే పేరు వచ్చింది.

ఆర్మీలో చేరాలనుకునే యువతకు గ్రామంలోని ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ట్రైనింగ్ ఇస్తోంది. ఫిట్‌గా ఉండేందుకు ఓ జిమ్‌ బిల్డింగ్ ఏర్పాటు చేసింది. స్వాతంత్రానికి ముందు నుంచే సైనికులుగా, అధికారులుగా సేవలు అందించిన ఘనత మాధవరం గ్రామానికి దక్కింది. సైన్యంలోకి అత్యధిక యువకులను పంపిస్తున్న ప్రాంతంగానూ గుర్తింపు గడించింది. మొదటి, రెండు ప్రపంచ యుద్ధాలతో పాటు దేశ స్వాతంత్ర్యం తర్వాత బంగ్లాదేశ్, శ్రీలంక తరఫున చేసిన యుద్ధాల్లోనూ ప్రతిభ కనబరిచారు మాధవరం గ్రామస్థులు.

సిపాయి హవల్దార్ మొదలు సుబేదార్ మేజర్, నాయక్, లెఫ్ట్నెంట్ కల్నల్ వంటి హోదాల్లో సేవలందించడం మాధవరం గ్రామానికి మరింత గౌరవాన్ని తెచ్చింది. వార్ మెమోరియల్ ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర ఉండగా రెండోది మాధవరంలోనే ఉండటం విశేషం. భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో 1850 మంది మాధవరం సైనికులు పాల్గొని సత్తా చాటారు.

మొదటి ప్రపంచ యుద్ధంలో 90 మంది, రెండో ప్రపంచ యుద్ధంలో 11వందల10 మంది, శ్రీలంక శాంతి పరిరక్షణ దళంలో 12 మంది, 1960 గోవా లేబరేషన్‌లో 150 మంది, 1965 ఇండోపాక్ యుద్ధంలో 900 మంది, 1971 బంగ్లా విముక్తి పోరాటంలో 950 మంది సైనికులు మాధవరం గ్రామం నుంచే ఉన్నారు. మాధవరం సైనికుల శౌర్య, పరాక్రమాలకు గుర్తుగా మిలట్రీ క్రాస్ మెడల్, చీఫ్ ఆఫ్ ఫార్మల్, స్టాప్ కమాండేషన్ మెడల్, రాష్ట్రపతి క్యాలెండర్ అవార్డు, ఆర్మీ కమాండర్ కమాండేషన్ అవార్డులు వరించాయి. ఇప్పటికీ దేశం కోసం పరితపిస్తూ.. దేశ భద్రతలో ఎన్నో త్యాగాలు చేస్తున్న మాధవరం గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story