Maha Padayatra: మహాపాదయాత్రపై పోలీసుల ఆంక్షలు.. వెళ్లే దారుల్లో..

Maha Padayatra (tv5news.in)
Maha Padayatra: అమరావతి రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్రపై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. పాదయాత్రలో పాల్గొనకుండా ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. చిలకలూరిపేటలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మార్టూరులో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును అరెస్టు చేశారు. సంతనూతలపాడులో మాజీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ ను గృహనిర్బంధం చేశారు.
ఇవాళ పాదయాత్ర ప్రారంభమయ్యే నాలుగుప్పలపాడుకు వచ్చే అన్ని దారుల్లో బారికేడ్లు పెట్టారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేట్టిన పాదయాత్ర 11వ రోజుకు చేరుకుంది.పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందంటున్నారు రైతులు. ఎన్ని ఆంక్షలు పెట్టినా పాదయాత్ర కొనసాగిస్తామంటున్నారు. ఐతే జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చెప్తున్నారు పోలీసులు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com