నేడు, రేపు TDP మహానాడు

నేడు, రేపు TDP మహానాడు
మహానాడు వేదిక గా ఎన్నికల శంఖారావం పూరించనున్న చంద్రబాబు పార్టీ నాయకులు, శ్రేణులకు దిశానిర్దేశం

మహానాడు వేదిక గా ఎన్నికల శంఖారావం పూరించనున్న చంద్రబాబు పార్టీ నాయకులు, శ్రేణులకు దిశానిర్దేశం చేసి ఎన్నికల సమరానికి సన్నద్ధం చేసేలా మహానాడు కార్యాచరణ చేపట్టనున్నారు. గత నాలుగేళ్లుగా వైసీపీ ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాలను సమీక్షించుకుని ఎన్నికల ఏడాదిలో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణను టీడీపి రూపొందించుకొనున్నది. అయితే మహానాడు వేదికగా నేడు ఎన్నికల తొలి మేనిఫెస్టోను చంద్రబాబు ప్రకటించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకోవటం ఎంతటి చారిత్రక అవసరమో ప్రజలకు మహానాడు ద్వారా చంద్రబాబు వివరించనున్నారు. NTR విగ్రహానికి చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కార్యక్రమాలు ప్రారంభo కానున్నాయి.

జగన్‌ ప్రభుత్వ విధ్వంసకర విధానాలు, సహజవనరుల దోపిడీ, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టటం,TDP ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు జగన్‌ ప్రభుత్వం రద్దు చేసిన తీరు, జగన్‌ ప్రభుత్వం నమోదు చేస్తున్న అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, ధరల పెరుగుదల, పన్నులు, ఛార్జీల బాదుడు తదితర 15 అంశాలపై సభలో తీర్మానాలు చేయనున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణకు సంబంధించి కూడా ఆరు తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చ జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story