మహానాడు వేదికగా ఎన్నికల శంఖారావం..

మహానాడుకు ముస్తాబైన రాజమహేంద్రవరం
మహానాడు వేదిక గా ఎన్నికల శంఖారావం పూరించనున్న చంద్రబాబు
పార్టీ నాయకులు, శ్రేణులకు దిశానిర్దేశం చేసి ఎన్నికల సమరానికి సన్నద్ధం చేసేలా మహానాడు కార్యాచరణ
గత నాలుగేళ్లుగా వైసీపీ ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాలను సమీక్షించుకుని ఎన్నికల ఏడాదిలో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణను రూపొందించుకొనున్న టీడీపీ
మహానాడు వేదికగా నేడు ఎన్నికల తొలి మేనిఫెస్టోను ప్రకటించనున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకోవటం ఎంతటి చారిత్రక అవసరమో ప్రజలకు మహానాడు ద్వారా వివరించనున్న చంద్రబాబు
తొలి రోజైన నేడు ప్రతినిధుల సభ, రెండో రోజైన రేపు బహిరంగ సభ
తొలిరోజైన నేడు ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కార్యక్రమాలు ప్రారంభo
జగన్ ప్రభుత్వ విధ్వంసకర విధానాలు, సహజవనరుల దోపిడీ, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టటం,టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు జగన్ ప్రభుత్వం రద్దు చేసిన తీరు, జగన్ ప్రభుత్వం నమోదు చేస్తున్న అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, ధరల పెరుగుదల, పన్నులు, ఛార్జీల బాదుడు తదితర 15 అంశాలపై సభలో తీర్మానాలు
తెలంగాణకు సంబంధించి కూడా ఆరు తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చ
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com