MAHANADU: మహానాడు వేదికగా ఆరు శాసనాలు ప్రతిపాదించిన లోకేశ్

"కాలం మారుతోంది... ప్రజల అవసరాలు మారుతున్నాయి... వారి ఆలోచన విధానం కూడా మారుతోంది... పార్టీ మూల సిద్దాంతం స్ఫూర్తితో ప్రస్తుత ప్రజా అవసరాలకు అనుగుణంగా కీలక విధానపరమైన మార్పులు తీసుకురావాలి" అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ అన్నారు. కడప గడపలో నిర్వహించిన మహానాడులో కీలకోపన్యాసం చేసిన నారా లోకేశ్... ఆరు ధర్మసూత్రాలను ప్రతిపాదించారు. నా తెలుగు కుటుంబం పేరుతో లోకేశ్ ఈ ఆరు శాసనాలను ప్రకటించారు. "అన్న ఎన్టీఆర్ హయాంలో ఆత్మాభిమానం నినాదం నియంతృత్వాన్ని తరిమేసింది. చంద్రబాబు హయాంలో ఆత్మవిశ్వాసం అనే నినాదం తెలుగు ప్రజల భవిష్యత్తుకు పునాది పడింది. ఇప్పుడు ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలకు, పార్టీకి, కార్యకర్తలకు మంచి భవిష్యత్తును అందించే లక్ష్యంతో సరికొత్త ప్రణాళికలు రూపొందించాల్సిన సమయం వచ్చింది" అని లోకేశ్ తెలిపారు. దీనికోసం ఆరు శాసనాలను ప్రతిపాదిస్తున్నానని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com