MAHANADU: లోకేశ్ అగమనం.. పసుపు దళం సిద్ధం

యువగళ సారధి నారా లోకేశ్... పసుపు దళపతి కాబోతున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదా నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమోషన్ అందుకోనున్నారు. కడప గడపలో జరుగుతున్న మహానాడులో లక్షలాది మంది తెలుగు తమ్ముళ్ల మధ్య నారా లోకేశ్ ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. టీడీపీలో వినిపిస్తున్న వాదన ప్రకారం ఇప్పటికే నారా లోకేశ్ ఎంపికకు సర్వం సిద్ధమైంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో కీలక పాత్ర పోషిస్తున్న లోకేశ్... ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కీలక బాధ్యతలు తీసుకోనున్నారు. చంద్రబాబు యాక్టివ్‌గా ఉన్నంత కాలం ఆయనే పార్టీ అధ్యక్షుడిగా ఉంటారు. ఇందులో ఎవరికీ సందేహం లేదు. అందుకే అలాంటి తరహా పోస్ట్… మరెవ్వరికీ లేని హోదా.. నారాలోకేష్‌కు దఖలు పరచాలన్నది పార్టీ క్యాడర్ కోరిక.. అందుకోసం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవని తెలుగుదేశంలో కొత్తగా సృష్టించనున్నారు.
చంద్రబాబు తర్వాత లోకేశే
తెలుగుదేశం అధినేత చంద్రబాబు తర్వాత పార్టీపై పూర్తి అధికారం ఉంది నారాలోకేష్‌కు మాత్రమే అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగుదేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయనున్నారు. ఆయనతో పాటు మరికొందరికి కూడా ఆ హోదా ఉంది. అయినప్పటికీ.. తెలుగుదేశం వ్యవస్థాపక వారసుడిగా ఆయనకు ప్రత్యేక అధికారం.. కార్యకర్తల్లో ప్రత్యేక అభిమానం ఉన్నాయి. కార్యకర్తలు ఆమోదించగలిగారు కాబట్టే ఆ హోదాను ఆయన పొందగలిగారు. లోకేష్ ఆయాచితంగా పార్టీ పదవిని తీసుకోలేదు. వారతసత్వంగా పెద్ద పదవి వచ్చిందేమో కానీ.. ఆయన మాత్రం 14 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతూనే ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com