Nandyal : అదుపు తప్పిన బస్సు... తప్పిన పెను ప్రమాదం...

Nandyal : అదుపు తప్పిన బస్సు... తప్పిన పెను ప్రమాదం...
X

ఏపీ లోని నంద్యాల లో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు కు పెను ప్రమాదం తప్పింది. తృటి లో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదం అందరిని షాక్ కు గురి చేసింది.

50 మంది ప్రయాణికుల తో నెల్లూరు నుండి నంద్యాల కు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు రోడ్ పక్కనే ఉన్న కరెంట్ స్తంభాన్ని డీ కొట్టింది. దీంతో అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ తెల్లవారుజామున శిరువెళ్ల మండల పరిధిలోని ఎర్రగుంట్ల ఉషోదయ ప్రైవేటు పాఠశాల వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. హై ఓల్టేజ్ కరెంట్ తీగలు బస్సు పై పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Tags

Next Story