Krishna District: కృష్ణా జిల్లాలో వింత పెళ్లి.. జాతకంలో దోషం ఉందంటూ..

Krishna District: కృష్ణా జిల్లాలో ఓ వింత పెళ్లి జరిగింది. పెళ్లిపీటలపై ఉన్న వధూవరులను చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు. వరుడి వరకు ఒకే అయినా, వధువు స్థానంలో మేక ఉండడమే దీనికి కారణం. మేకతో యువకుడి పెళ్లి తంతు నూజివీడులో చోటుచేసుకుంది. దీనికంతటికి కారణం జ్యోతిష్యంపై యువకుడి కుటుంబానికి ఉన్న గురే.
తన జాతకంలో రెండు పెళ్లిళ్లు ఉన్నాయని, మేకతో పెళ్లి చేస్తే దోషం పోతుందని జ్యోతిష్యుడు సూచించడంతో యువకుడు ఈ వింత పెళ్లికి సిద్ధపడ్డాడు. నూజివీడు పట్ణణపరిధిలోని నవగ్రహ ఆలయంలో ఈ యువకుడికి మేకతో పెళ్లి జరిగింది. ఉగాది రోజున అర్చకులు శాస్త్రోక్తంగా యువకుడితో మేక మెడలో మూడుముళ్లు వేయించారు. మేకతో పెళ్లి ద్వారా దోషం పోయిందని యువకుడు సంతోషపడుతుండగా, స్థానికులు మాత్రం మేకతో పెళ్లా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com