Vijayawada: విజయవాడ దుర్గ గుడిలో తెరలేచిన అడ్డగోలు దోపిడీ..

Vijayawada: విజయవాడ దుర్గ గుడిలో నిబంధనలు బేఖాతరు చేస్తూ.. అడ్డగోలు దోపిడీకి తెరలేచినట్లు కన్పిస్తోంది. 21 గ్రాములకన్నా తక్కువ ఉండే బంగారు కానుకలను హుండీలోనే వేయాలని, రశీదులివ్వమని సిబ్బంది చెబుతున్నారు. నిబంధనల ప్రకారం అమ్మవారికి ఒక గ్రాము బంగారం కానీ.. ఇతర వస్తువులేవైనా కానుకగా ఇస్తే.. రిజిస్టర్‌లో నమోది చేసి రసీదు ఇవ్వాల్సి ఉంటుంది.
ఐతే.. హుండీలో వేసిన కానుకలకు మాత్రం రశీదులు ఉండవు. ఇటీవల అమ్మవారికి కానుకగా ఓ భక్తురాలు బంగారు, వెండి వస్తువులు ఇచ్చారు. బంగారం 7 గ్రాములే ఉందని బంగారం, వెండి కానుకలను అధికారులు హుండీలో వేయించారు. దీంతో.. దుర్గ గుడి అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమ్మవారికి వచ్చిన బంగారు కానుకలను దోచుకునేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com