Manyam : మన్యం జిల్లాలో ఏనుగుల హల్ చల్

మన్యం జిల్లా అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఏనుగులు. తరచూ గ్రామాల్లో చొరబడి దాడులు చేస్తున్నాయి. పంటను నాశనం చేస్తున్నాయి. ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదంటున్నారు స్ధానికులు.
పార్వతీపురం మన్యం జిల్లాను ఏనుగులు హడలెత్తిస్తున్నాయి. నాగావళి నది దాటుకుని జిల్లాలోకి ప్రవేశించిన ఏడు ఏనుగుల గుంపు గ్రామాల్లో సంచరిస్తూ ఘీంకరిస్తున్నాయి. వీరఘట్టం మండలం కిమ్మి, నడుకూరు గ్రామాల మధ్య హల్‌చల్ చేస్తున్నాయి. అటు విజయనగరం జిల్లా వంగర మండలంలోను గజరాజుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. దాంతో అటవీ అధికారులకు స్థానికులు, రైతులు ఫిర్యాదు చేశారు. ఏనుగులు ఎప్పుడు, ఏంచేస్తాయోనని స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com