Pithapuram : పిఠాపురంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు..10వేల మందికి పవన్ చీరలు

X
By - Manikanta |22 Aug 2025 1:30 PM IST
కాకినాడ జిల్లాలోని పురాతన ఆలయం పిఠాపురం శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. ఈ పూజా కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి కూడా పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం మహిళలకు చీరలు, కుంకుమ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ వర్గాలు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మొత్తం 10,000 మంది మహిళలకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తరఫున చీరలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు, నాయకుల మధ్య ఉత్సాహాన్ని నింపింది.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com