Leopard : రాజమండ్రిలో చిరుతను పట్టేందుకు భారీ ఏర్పాట్లు

Leopard : రాజమండ్రిలో చిరుతను పట్టేందుకు భారీ ఏర్పాట్లు
X

రాజమండ్రి కడియం పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న చిరుత పులి కోసం ఫారెస్ట్ సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి కడియపు లంక దోసాలమ్మ కాలనీ వద్ద చిరుత ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. నిన్న సాయంత్రానికి బుర్రిలంక వద్ద గోదావరి లంకలోకి చిరుత ప్రవేశించినట్టు అడుగుజాడలు గుర్తించారు. జింకల వేట కోసం చిరుత పులి లంకల వైపు వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు.

దీనిపై ఫారెస్ట్ అధికారులు ఒక క్లారిటీ ఇవ్వనున్నారు. ఇప్పటికే చిరుత కోసం 20 ట్రాప్ కెమెరాలు... ఐదు సీసీ కెమెరాలు... జంతువులను ఎర వేసి ప్రత్యేక బోన్లను ఏర్పాటు చేశారు. చిరుత సంచారం భయంతో బుధవారం కడియం నర్సరీల కార్మికులకు సెలవు ప్రకటించడంతో మొక్కల ఎగుమతులు నిలిచిపోయాయి.

Tags

Next Story