Nandigama : నందిగామలో మెడికల్ షాపులు Vs డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు

Nandigama : నందిగామలో మెడికల్ షాపులు Vs డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు
X

ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని మెడికల్ దుకాణాల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్, ఈగల్ టీమ్ అధికారుల తనిఖీలలో ఉద్రిక్తత ఏర్పడింది. అధికారులను దుకాణదారులు అడ్డుకున్నారు. పట్టణంలోని రెండు దుకాణాల్లో ఔషధ నియంత్రణ అధికారులు తనిఖీలు చేశారు. స్థానిక ప్రధాన రోడ్డులోని ఓ దుకాణంలో తనిఖీలు చేస్తుండగా.. పట్టణ టీడీజీ అధ్యక్షుడు, వాణిజ్య మండలి అధ్యక్షుడు యేచూరి రామకృష్ణ, మరికొంత మంది వ్యాపారులు అక్కడికి చేరుకుని ఎందుకు తనిఖీలు చేస్తున్నారని అధికారిని ప్రశ్నించారు. తమకు ఫిర్యాదులు రావడంతో వచ్చినట్లు డ్రగ్ ఇన్స్పెక్టర్ సురేష్ తెలిపారు. మామూళ్లు కోసమే తనిఖీలు చేస్తున్నారని ఆరోపించగా ఆయన ఖండించారు. మందులు అక్రమంగా క్రయ, విక్రయాలు చేస్తున్నారని మందులు విక్రయిస్తున్నట్లు అధికారి ఆరోపించారు.

స్థానిక ఎమ్మెల్యే సౌమ్య ఫోన్ చేస్తే బయట ఉన్నానని చెప్పి, ఇక్కడ తనిఖీలు చేస్తున్నారని వ్యాపారులు అంటున్నారు. డ్రగ్ ఇన్స్ పెక్టర్ ఎమ్మెల్యే దగ్గరకు రావాలని రామకృష్ణ పట్టుబట్టారు. లేకపోతే ఎమ్మెల్యేనే వస్తారన్నారు. దీనిపై అధికారి మాట్లాడుతూ తాము తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఇవి ఆపేసి రావడం కుదరదని తర్వాత వచ్చి ఎమ్మెల్యేను కలుస్తామని చెప్పారు. సమాచారం అందుకున్న సీఐ, వారికి సర్ది చెప్పి వ్యాపారులు, ఇతరులను దుకాణం నుంచి బయటకు పంపించారు.

ఈ నేపథ్యంలో పట్టణం లోని మందుల దుకాణాలను వ్యాపారులు మూసి వేశారు. రాత్రి వరకు దుకాణాలు తెరవకపోవడంతో మందుల కోసం వచ్చినవారు ఇబ్బందిపడ్డారు. అనంతరం స్థానిక క్లాత్ మర్చంట్స్ అసోసి యేషన్ హాలులో మెడికల్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. విజయవాడ సంఘ అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ.. అధికారుల దాడుల విషయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.వెంటనే దుకాణాలు తెరచి ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు.

Tags

Next Story