Mekapati Goutham Reddy Funeral : మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియల స్థలం మార్పు..!

Mekapati Goutham reddy Funeral : గుండెపోటుతో మరణించిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించనున్నారు. ముందు...స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వహించాలని భావించారు.
ఆ తర్వాత ఉదయగిరిలోని వారి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ వద్దకు మార్చారు. రేపు ఉదయం 11గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గౌతమ్ రెడ్డి పార్థీవ దేహాన్ని ఇవాళ ఉదయం నెల్లూరుకి ఎయిర్ అంబులెన్స్‌లో తీసుకెళ్తారు. ప్రజల సందర్శనార్థం నెల్లూరులోని మేకపాటి గెస్ట్ హౌస్‌లో గౌతమ్ రెడ్డి పార్థివ దేహాన్ని ఉంచుతారు.
ఆ తర్వాత రేపు ఉదయం అక్కడి నుంచి ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీకి తరలిస్తారు. అక్కడే ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. గౌతమ్‌రెడ్డి కుమారుడు విదేశాల్లో ఉన్నారు. ఆయన ఇవాళ సాయంత్రం వచ్చే అవకాశం ఉంది. ఆయన వచ్చిన తర్వాత ఉదయగిరిలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com