Holi : వినూత్నంగా హోలి.. మహిళల వేషాలు వేసుకుంటున్న పురుషులు

Holi :  వినూత్నంగా హోలి.. మహిళల వేషాలు వేసుకుంటున్న పురుషులు
Holi : రంగులతో ఉత్సాహంగా నిర్వహించుకునే హోలి సంబరాలను కర్నూలు జిల్లాలో వినూత్నంగా నిర్వహించుకున్నారు.

Holi : రంగులతో ఉత్సాహంగా నిర్వహించుకునే హోలి సంబరాలను కర్నూలు జిల్లాలో వినూత్నంగా నిర్వహించుకున్నారు. ఆదోని మండలం సంతేకుడ్డూరులో హోలి పండుగ సందర్బంగా పురుషులు స్త్రీల వేషాలు ధరించి ర్యాలీగా బయలుదేరి.. రతీ మన్మధులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు అక్కడ నిర్వహించిన కుంభోత్సవంలో పాల్గొన్నారు. హోలి పండుగ రోజు పురుషులు మహిళల వేశధారణలో మన్మధుస్వామిని దర్శించుకుంటే శుభం కల్గుతుందని.. కోరిన కోర్కెలు నెరవేరుతాయని ఇక్కడి గ్రామస్తుల నమ్మకం. దీంతో వాడవాడలా పురుష లేడీసే దర్శన మిచ్చారు. దీంతో హోలి రోజు ఆ సంప్రదాయాన్ని తరతరాలుగా కొనసాగిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story