AP : ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

ఇంటర్మీడియట్ కాలేజీల్లో గత ప్రభుత్వం రద్దు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని మళ్లీ పునరుద్ధరించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఈ పథకం పునరుద్ధరణతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని 1.41 లక్షల మంది విద్యార్థులకు మేలు జరగనుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులతో పాటు రాష్ట్రంలోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాలు, ఏపీ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, హై స్కూల్ ప్లస్ విద్యా సంస్థలకు రూ.32.45 కోట్ల అంచనా వ్యయంతో 2025-26 విద్యా సంవత్సరంనుంచి పాఠ్య పుస్తకాలు, వృత్తిపరమైన పాఠ్య పుస్తకాలు, పోటీ పరీక్షల మెటీరియల్, రికార్డ్ బుక్స్, కొనుగోలు చేసి సరఫరా చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ప్రస్తుతం ఇంటర్ విద్యకే పరిమితం కాగా ప్రైవేటు జూనియర్ కాలేజీలు జేఈఈ, నీట్ అంటూ అదనపు కోచింగ్ ఇస్తున్నాయి. ఇది గుర్తించిన ప్రభుత్వం.. ఇకపై ప్రభుత్వ కాలేజీల్లోనూ అదే విధానం అమలు చేయాలని నిర్ణయించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com