AP : ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభం

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం నేటి నుంచి మధ్యాహ్న భోజనం అందిస్తోంది. ఈ పథకాన్ని మంత్రి నారా లోకేశ్ విజయవాడ జిల్లా పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, ఎంపీ శివనాథ్, బొండా ఉమ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో లోకేశ్ మాట్లాడారు.
‘‘మంగళగిరిలో 2019లో నేను ఓడిపోయాను. కానీ పట్టుదలతో పరిశ్రమించి రికార్డుస్థాయి మెజారిటీతో గెలిచాను. జీవితంలో గెలుపు ఓటములు సహజం. పరీక్షలు తప్పినందుకే చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. విద్యార్థులు ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. విద్యావ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని నిర్ణయించాం. అందుకే ప్రముఖుల పేర్లతో పథకాలు ప్రారంభించాం. సమానత్వం విద్యార్థి దశ నుంచే ప్రారంభం కావాలి. పుస్తకాల్లో ఆటలకు పురుషుల బొమ్మలు, ఇంటి పనులకు బాలికల బొమ్మలు ఉన్నాయి. పాఠ్య పుస్తకాల్లో ఈ అసమానతలను తొలగించాలని అదేశించాను’’ అని లోకేశ్ తెలిపారు.
ఈ స్కీమ్ కోసం ప్రభుత్వం ఈ ఏడాది రూ.27.39 కోట్లు ఖర్చు చేయనుంది. వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేసేందుకు రూ.85.84కోట్లు కేటాయించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com