Vijayawada : బెజవాడలో పాల డెయిరీలు మూత.. ఆఫ్ లీటర్ పాలు రూ.80

Vijayawada : బెజవాడలో పాల డెయిరీలు మూత.. ఆఫ్ లీటర్ పాలు రూ.80

విజయవాడలో తట్టుకోలేని పాల కొరత ఏర్పడింది. ఇదే అదనుగా వ్యాపారులు అమాంతం పాల రేట్లు పెంచేశారు. అర లీటర్ పాల ప్యాకెట్ ధర రూ.70ల నుంచి రూ.80లకు విక్రయిస్తున్నారు. ఇళ్లలో పిల్లలు ఉన్నారని, కనీసం ఒక్క ప్యాకెట్ అయినా పాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

విజయ డెయిరీ, కృష్ణ మిల్క్ యూనియన్ సెంట్రల్ ఆఫీసులు నీటమునిగాయి. దాదాపు లక్షల లీటర్ల పాలు, పెరుగు ప్యాకెట్లు చెడిపోయాయి. దాంతో పాల కొరత తీవ్రమైంది. ఇతర జిల్లాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి పాలను తెప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

మరోవైపు.. కొన్ని ఏరియాల్లో తల్లులు అన్నం అవసరం లేదు పాలు పంపించండి అని కోరుతున్నారు. పాల ప్యాకెట్ల పంపిణీపై ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు దృష్టిపెట్టాయి.

Tags

Next Story