ఆంధ్రప్రదేశ్

Minister Anil Kumar Yadav: హీరో నాని భజనపరుడు.. ఆయన గురించి మాట్లాడటం వేస్ట్‌: మంత్రి అనిల్ కుమార్

Minister Anil Kumar Yadav: సినిమా టికెట్‌ ధరల తగ్గిస్తూ ఇచ్చిన జీవోపై నాని చేసిన వ్యాఖ్యలపై అనిల్‌ కుమార్‌ స్పందించారు.

Minister Anil Kumar Yadav: హీరో నాని భజనపరుడు.. ఆయన గురించి మాట్లాడటం వేస్ట్‌: మంత్రి అనిల్ కుమార్
X

Minister Anil Kumar Yadav: ఏపీలో సినిమా టికెట్‌ ధరల తగ్గిస్తూ ఇచ్చిన జీవోపై హీరో నాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి అనిల్‌ కుమార్‌ స్పందించారు.. సినిమా బడ్జెట్‌లో 80 శాతం నలుగురు పంచుకుని 20 శాతం మాత్రమే సినిమాకు ఖర్చు పెట్టి.. పంచుకున్న 80 శాతాన్ని కోట్లాది మంది జనం నుంచి వసూలు చేయానుకోవడం సమంజసం కాదన్నారు.. కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ పోతుందనే బాధతోనే నాని అలా మాట్లాడారని కౌంటర్‌ ఇచ్చారు.

హీరో నాని భజనపరుడని.. ఆయన గురించి మాట్లాడటం వేస్ట్‌ అని అన్నారు.. ఇక పవన్‌ కల్యాణ్‌పైనా మంత్రి అనిల్‌ కుమార్‌ విరుచుకుపడ్డారు.. భీమ్లా నాయక్‌, వకీల్‌ సాబ్‌ సినిమాలకు ఆయన ఖర్చు ఎంత..? పవన్‌ కల్యాణ్‌ తీసుకున్న రెమ్యునరేషన్‌ ఎంత అని ప్రశ్నించారు..

పవన్‌ కల్యాణ్‌ క్రేజ్‌ని నమ్ముకున్నారంటూ ఎద్దేవా చేశారు.. తాను కూడా బైక్‌లు తాకట్టు పెట్టి అభిమాన హీరోకి పూల మాలలు, సినిమా కటౌట్లు కట్టి నష్టపోయానని అన్నారు.. మీ అందరికన్నా ముందు నేను గొరిగించుకున్నా.. ఇప్పుడు మేల్కొంటున్నా అంటూ పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు ఉపదేశం చేశారు మంత్రి అనిల్‌ కుమార్‌.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES