Minister Appalaraju : మూడు రాజధానులపై మంత్రి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు

Minister Appalaraju : న్యాయస్థానం ఎన్ని సార్లు చెప్పి... మంత్రులు, వైసీపీ నేతల తీరు మారడం లేదు. మేము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా ఉన్నాయి మంత్రుల మాటలు. మూడు రాజధానులపై మంత్రి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిని వికేంద్రీకరించి విశాఖలో సెక్రటేరియెట్ కట్టిస్తామన్నారు. అమరావతిలో ఉన్న అసెంబ్లీని కొనసాగించి, లెజిస్లేటివ్ కేపిటల్ చేస్తామన్నారు. ఇక కర్నూల్‌లో హైకోర్టును కట్టి న్యాయ నిర్వాహక రాజధానిగా రాయలసీమను చేస్తామన్నారు మంత్రి అప్పలరాజు... ఇక అమరావతి రాజధాని కావాలని చంద్రబాబు కోర్టుకు వెళ్లారని... అది అమరావతి కాదని... కమ్మరావతి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల కోసం సీఎం జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని... వికేంద్రీకరణ.. మూడు రాజధానులే తమ విధానమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి మద్దతు పలకాలన్నారు. వికేంద్రీకరణ ముద్దు... కమ్మరావతి వద్దని నినాదించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి అప్పలరాజు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com