Buggana Rajendranath : మంత్రి బుగ్గనకు నిరసన సెగ.. నిలదీసిన మహిళలు
Buggana Rajendranath : నంద్యాల జిల్లాలో మంత్రి బుగ్గనకు నిరసన సెగ తగిలింది. బేతంచర్ల మండలం హెచ్ కొట్టాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన్ను నిలదీశారు జనం. రెండు నెలలుగా ఉపాధి హామీ పనులు కూలీలు రాలేదంటూ మహిళలు మంత్రికి మొరపెట్టకున్నారు. డబ్బులు ఎందుకు పడలేదని సంబంధిత అధికారిని మంత్రి అడిగారు. అధికారి నుంచి వివరాలు తెలుసుకున్న తర్వాత వారంలో డబ్బులు అందుతాయని సమాధానం చెప్పిన మంత్రి అక్కడి నుంచి తప్పుకుని వెళ్లిపోయారు. అటు కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవిని నిలదీశారు. ప్లాస్టిక్ బియ్యం తిని అస్వస్థతకు గురవుతున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు పించన్ ఇవ్వడం లేదంటూ.. ఓ వృద్ధురాలు.. ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే.. ప్రశ్నించే వారినంతా... టీడీపీ మద్దతుదారులంటూ ఎమ్మెల్యేను పక్కకి తీసుకెళ్లారు స్థానిక వైసీపీ నేతలు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com