ఆ ఆఫీసర్ మాట వినడం లేదంటూ.. మంత్రి గౌతంరెడ్డి లేఖ..

ఆ ఆఫీసర్ మాట వినడం లేదంటూ.. మంత్రి గౌతంరెడ్డి లేఖ..

నెల్లూరులో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మాటకే దిక్కులేదా..? ఆయన చెప్పినా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ మాట వినడం లేదా? నెల్లూరు జిల్లాలో ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది. తాజాగా జిల్లా కలెక్టర్‌కి ఆయన రాసిన లేఖ కలకలం రేపుతోంది. నెల్లూరులోని పొదలకూరు రోడ్డులో ఉన్న తన క్యాంప్ ఆఫీస్ పరిసరాల్లో పరిశుభ్రత అస్సలు లేదంటూ మంత్రి అసహనంతో ఉన్నారు. దీనిపై హెల్త్ ఆఫీసర్‌కి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఏకంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో తనను వ్యక్తిగతంగా కలవాలని కోరినా కూడా అధికారి పట్టించుకోవడం లేదని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. మంత్రే తనను పట్టించుకోవడం లేదంటూ లేఖ రాసారంటే.. సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చంటూ ఇప్పుడు ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.Tags

Read MoreRead Less
Next Story