Nara Lokesh : ఆమెకు న్యాయం జరగాలి.. కోల్‌కతా ఘటనపై మంత్రి లోకేశ్

కోల్‌కతాలో వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటనను మంత్రి నారా లోకేశ్ ఖండించారు. ఆమెపై జరిగిన దారుణాన్ని తలుచుకుంటే మాటలు రావట్లేదన్నారు. "ఆ యువ వైద్యురాలు పడిన బాధను తలచుకుంటే మాటలు రావడంలేదు. ఈ క్రూరత్వానికి ఏ ఖండన లేదు. న్యాయం వేగంగా, నిర్ణయాత్మకంగా, ఆదర్శప్రాయంగా ఉండాలి. బాధితురాలి కుటుంబానికి, ఆమెకు న్యాయం చేయాలని కోరుతున్న వారందరికీ నేను సంఘీభావం తెలుపుతున్నాను. ప్రతి మహిళకు భద్రత, గౌరవాన్ని ఇవ్వడానికి మనం ఐక్యంగా ఉండాలి. మంచి మనిషిగా ఉండడమే అత్యంత ప్రభావవంతమైన నిరసన... అబ్బాయిలు, పురుషులందరికీ నా సందేశం ఇదే! ఇది అందరి పోరాటం కావాలి" అని లోకేశ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మరోవైపు కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన నేపథ్యంలో ఆందోళన చేపట్టిన వైద్యుల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య శాఖ హామీ ఇచ్చింది. డెంగీ, మలేరియా కేసులు పెరుగుతున్నందున ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వెంటనే విధుల్లో చేరాలని కోరింది. వైద్యుల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com