Nara Lokesh : కువైట్ బాధితురాలికి అండగా మంత్రి లోకేశ్

Nara Lokesh : కువైట్ బాధితురాలికి అండగా మంత్రి లోకేశ్
X

సాయం అడిగిన వారికి మంత్రి లోకేశ్ అండగా నిలుస్తున్నారు. నేనున్నా అంటూ భరోసా ఇస్తున్నారు. తాను కష్టాలు పడుతున్నానంటూ కువైట్ నుంచి ఓ మహిళ వీడియో సందేశాన్ని పెట్టింది. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు గ్రామానికి చెందిన దేవి ఉద్యోగం కోసం కువైట్ వెళ్లింది.

ఆఫీసులో ఉద్యోగం అంటూ తనను తీసుకువెళ్లి వెట్టిచాకిరీ చేయిస్తున్నారంటూ ఆమె వాపోయింది. దీనికి స్పందించిన మంత్రి లోకేశ్ సోదరీ.. నిన్ను క్షేమంగా ఇంటికి తీసుకువచ్చే బాధ్యత నాది అంటూ ఎక్స్ పోస్టు చేశారు. అదేవిధంగా తన చిన్నాన్న బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నాడని, సహాయం చేయాలని గుంటూరుకు చెందిన యువకుడు శ్రీనివాసరెడ్డి కోరగా లోకేశ్ వెంటనే స్పందించారు. వీలైనంత సాయం చేస్తానని బదులిచ్చారు. ఎవరైనా తమకు సహాయం కావాలంటూ సామాజిక మాధ్యమాల్లో తెలియజేయగా దానికి మంత్రి లోకేశ్ వెంటనే స్పందిస్తున్నారు.

Tags

Next Story