Minister Lokesh : మా అమ్మను అంటే ఊరుకోవాలా..మండలిలో ఊగిపోయిన మంత్రి లోకేశ్

Minister Lokesh : మా అమ్మను అంటే ఊరుకోవాలా..మండలిలో ఊగిపోయిన మంత్రి లోకేశ్
X

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్‌ శాసన మండలిలో ఊగిపోయారు. విపక్ష నేత బొత్స వ్యాఖ్యలకు గట్టి కౌంటర్‌ ఇచ్చారు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై లోకేశ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉండి కూడా చంద్రబాబు సభకు తప్పకుండా వచ్చేవారన్నారు. సింహంలా సింగిల్‌గా నిలబడ్డారని గుర్తుచేశారు. గతంలో శాసనసభ సాక్షిగా తన తల్లిని వైసీపీ సభ్యులు అవమానించిన తర్వాతే ఆవేదనతో ప్రతిజ్ఞ చేసి వెళ్లిపోయారన్నారు. టీడీపీ నేతలపై మళ్లీ అసభ్యకర పోస్టులు చేస్తున్నారన్నారు. మాట్లాడాలనుకుంటే తామూ మాట్లాడగలమనీ..సంస్కారం తమకుందని చెప్పారు లోకేశ్.

Tags

Next Story