Minister Lokesh : మాట నిలబెట్టుకున్నామన్న మంత్రి లోకేష్

ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో తాము ముందుంటామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. విద్యా వ్యవస్థలో కొత్త మార్పులే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే పలు నూతన సంస్కరణలు అమలు చేశారు. తల్లికి వందనం, జూనియర్ కాలేజ్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం వంటి పథకాలతో అందరిని ఆకర్షిస్తున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేశారు.
కాగా గత ఏడాది డిసెంబర్ 7 న బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలలో చాలా సమస్యలు ఉన్నాయని మీటింగ్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం సంవత్సరంలోగా పాఠశాలలో అన్ని వసతులు కల్పించాలని మంత్రిని, అధికారులను ఆదేశించారు.
సీఎం ఆదేశాలతో పనులు చేపట్టిన విద్యాశాఖ బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో 24 గదులు, డైనింగ్ హాల్, ల్యాబ్స్ తో కూడిన అన్ని మౌలిక వసతుల కల్పన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. దీనికి కృషి చేసిన అందరికీ మంత్రి అభినందనలు తెలిపారు. "మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.. మంచి ఫలితాలు సాధించి బాపట్ల మున్సిపల్ హైస్కూల్ పేరు నిలబెట్టాలని విద్యార్థులు, ఉపాధ్యాయులను కోరుతున్నాం” అని మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com