Minister Lokesh : గూగుల్ క్యాంపస్‌లో మంత్రి లోకేశ్..ప్రెజెంటేషన్

Minister Lokesh : గూగుల్ క్యాంపస్‌లో మంత్రి లోకేశ్..ప్రెజెంటేషన్
X

శాన్ ఫ్రాన్సిస్కోలోని గూగుల్ క్యాంపస్‌ను ఏపీ మంత్రి నారాలోకేష్ సందర్శించారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, బికాస్ కోలేలతో లోకేష్‌తో భేటీ అయ్యారు. ఆన్‌లైన్ రీసెర్చి, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ అడ్వర్‌టైజింగ్‌లో తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని గూగుల్ క్లౌడ్ ప్రతినిధులు తెలిపారు. ఏపీ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా తయారవుతోందనినారా లోకేశ్‌ వివరించారు. విశాఖపట్నంలో డాటా సెంటర్ల ఏర్పాటుపై దృష్టిసారించామని... పిపిపి మోడ్‌లో గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్‌ను ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. ప్రభుత్వ కార్యకలాపాలను డిజిటలైజ్ చేయడం ద్వారా మెరుగైన పౌరసేవలు అందించేందుకు ఎఐ టూల్స్, ఎంటర్ ప్రైజ్ సొల్యూషన్స్ కల్పించాలన్నారు.

Tags

Next Story